అందోల్ నియోజకవర్గం లో వరద ప్రాంతాలకు దెబ్బతిన్న రోడ్లు మరమ్మత్తులకు 44 కోట్లు మంజూరు

చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 17)
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా, సంగారెడ్డి లోని ఆదివారం తన నివాసంలో అందోల్ నియోజక వర్గం లోని అన్ని మండలాల లో పంచాయత్ రాజ్ శాఖ అద్వర్యం లో చేపట్టుతున్న నూతన రోడ్ల నిర్మాణం , మరమ్మత్తులు , ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు , పునర్ నిర్మాణ పనులపై పంచాయితీ రాజ్ శాఖ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు .
ఈ సమీక్షలో అందోల్ నియోజక వర్గం లో పంచాయిత్ రాజ్ శాఖ అద్వర్యం లో సుమారు 44 కోట్ల రూపాయలతో చేపట్టుతున్న రోడ్ల అభివృద్ధి పనులు, నూతన రోడ్ల నిర్మాణం , మరమ్మత్తులు, సి సి రోడ్ల నిర్మాణం , హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు , గ్రామపంచాయితీ భవనాల నిర్మాణం , అంగన్వాడీ భవనాల నిర్మాణం, మరమ్మత్తులు, గ్రామీణ ఉపాధి పథకం లో చేపట్టుతున్న పనులు , ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు , పునర్ నిర్మాణ పనులను యుద్ధ ప్రతిపాదికపై పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా పంచాయితీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయితీ రాజ్ శాఖ ఎస్ ఈ జగదీశ్వర్ , ఈ ఈ అంజయ్య , డి ఈ ఈ లు , ఏ ఈ ఈ లు పాల్గొన్నారు .


