ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

భారీ వర్షాలు,వరదల కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

(టేక్మల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 17)

*భారీ వర్షాలు,వరదల కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు.

ఆదివారం టేక్మాల్ మండలంలో కలెక్టర్

విస్తృతంగా పర్యటించి పెద్ద చెరువు అలుగు పారి టేక్మాల్ టు దానోరా రోడ్డు  వరద ప్రవాహం గురైన ప్రాంతాన్ని , పరిశీలించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో ప్రాజెక్టులు చెరువులు నిండుకుండలా మారాయని ఉదృతంగా ప్రవహిస్తున్నందున‌ ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు రాకపోకలు ఇబ్బంది కాకుండాచూస్తున్నామన్నారు. .ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంక‌లు దాటే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌లను అప్ర‌మ‌త్తం చేయాల‌ని తెలిపారు. రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకూ ప్రజలు బయటకు రాకూడదని, సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ తాసిల్దార్ తులసీరామ్, ఆర్ అండ్ బి ఈ సర్దార్ సింగ్, ఈ.ఈ ఇరిగేషన్ శ్రీనివాసులు, సంబంధిత పంచాయతీ సెక్రటరీలు, సంబంధించిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!