అనాధ అమ్మకు నేనున్నా అంటూ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి…

అనాధ అమ్మకు నేనున్నా అంటూ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 18 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో గత పది రోజుల నుండి వానలో తడుచుకుంటూ ఉంటున్న వృద్ధురాలికి అండగా ఆపన్న హస్తం గా ఉంటామని కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. సోమవారం అనాధగా కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఉంటున్న విషయాన్ని తెలుసుకున్నారు. విషయం గమనించి వెంటనే విషయం తెలుసుకొని రైల్వే స్టేషన్ కి బయలు దేరారు. తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆమె పూర్తి వివరాలు తెలుసుకొని, కామారెడ్డి జిల్లా శిశు సంక్షేమ అధికారికి కాల్ చేసి మాట్లాడారు. అలాగే, వృద్దురాలు ఆరోగ్యం పట్ల, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి స్వయంగా ఆటోలు తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అయ్యే వరకు అక్కడ ఉండి ఆసుపత్రి సిబ్బందితో బాగా చూసుకోవాలని కోరారు, ఆరోగ్యం గురించి మాకు సంప్రదించాలాని అవసరం అయినా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా వృద్దురాలికి దుస్తులు, ఆహారం అందించారు మాజీ చైర్మన్ వెంట ఎస్సై వినయ్ కుమార్, బండారి శ్రీకాంత్, యూత్ సభ్యులు నర్సోలా మహేష్, శశిలు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!