పోరాటాల యోధుడు పాపన్న గౌడ్…

సర్దార్ సర్వాయు పాపన్న గౌడ్ గొప్ప పోరాటయోధుడని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు

(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)

సర్దార్ సర్వాయు పాపన్న గౌడ్ గొప్ప పోరాటయోధుడని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. సోమవారం జిల్లా వెనుకబడిన అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని ఎన్సాన్ పల్లి వెళ్ళే మార్గం వద్దగల చౌరస్తా లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….

సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచింది. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ఓక ప్రతీక. నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను కావాలని ప్రజాస్వామ్యక స్ఫూర్తితో చేసిన పోరాటం గొప్ప విషయం. విశ్వ కీర్తి పొందిన ఆయన గొప్పదనాన్ని స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అధికారులు, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాలు అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది.

Akhand Bhoomi News

error: Content is protected !!