శ్రీ .సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం

వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ .సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18 )

వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ .సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం పురస్కరించుకొని, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆవిష్కరించారు.

అనంతరం విగ్రహానికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సర్దార్ పాపన్న గారి పోరాటాలు, త్యాగాలు వెనకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని అన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకలుగా జరపడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టి జి ఐ ఐ సి చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గం శాసన సభ్యులు చింతా ప్రభాకర్ ,జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ,సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!