ఘనంగా మండల స్థాయి టీ.ఎల్.ఎం-మేళా నిర్వహణ

(సదాశివపేట ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)
-ఎన్.శంకర్, మండల విద్యాధికారి, సదాశివపేట మండలం.
సోమవారం రోజున రవీంద్ర మోడల్ ఉన్నత పాఠశాల రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాలల సముదాయంలో మండల స్థాయి టి.ఎల్.ఎం(ఉపాధ్యాయుల బోధనోపాకరణాల) మేళాను ఘణంగా నిర్వహించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.
ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు బోధించే తెలుగు, ఇంగ్లీష్, గణితం ఈ.వీ.ఎస్ సబ్జెక్టుల వివరించడానికి టీచర్స్ ఉపయోగించే వివిధ రకాల భోధనోపకరణాలను ప్రదర్శించడం జరిగిందని, మండలంలోని 55 పాఠశాలల టీచర్స్ వివిధ రకాల బోధనోపకరణాలు తయారు చేసుకుని వచ్చి ప్రదర్శించడం జరిగిందని, వీటిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 10 పాఠశాలలను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్.ఎన్.ఓ సుధాకర్, కాంప్లెక్స్ హెచ్.ఎం లు జయసుధ, వినయకుమార్,రాజశ్రీ, నిజాముద్దీన్, వివిధ పాఠశాలల హెచ్.ఎంలు, టీచర్స్ మరియు సిఆర్పిలు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.


