సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి… అదనపు కలెక్టర్ మాధురి
ఘనంగా జయంతి వేడుకలు
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జయంతోత్సవ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి , డిఆర్ఓ పద్మజరాణి , తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ… పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన వేడుకల్లో వక్తలు మాట్లాడుతూ, రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి మొఘల్ రాజుల దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలన చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో , బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, గౌడ సంఘము సభ్యులు నక్క నాగరాజు గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు.జంగాగౌడ్ జిల్లా కల్లుగీత కార్మిక సంఘం,వర్కింగ్ ప్రసిడేంట్.ప్రభుగౌడ్, జిల్లా గౌడ సంఘం వర్కింగి ప్రసిడేంట్. రాములు గౌడ్, గౌరవ అధ్యక్షులు. వీరేశం గోడ్, జనరల్ సెక్రటరి. రమేశ్ గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం ప్రదాన కార్యదర్శి. ప్రభుగౌడ్, బి.సి సంఘం అధ్యక్షులు. నరేశ్ గౌడ, వినయ్ గాడ్, డాక్టర్ రాజు గౌడ్.
మనోహర్ గౌడ్, మాజీ జడ్ పి.టి,సి. డాక్టర్ స్వామి గౌడ్,
మల్లా గౌడ్, శ్రీనివాస్ గౌ, మాజీ జిల్లా పరిషత్ చేర్మన్.సురేందర్ గౌడ్ కుల సంఘ నాయకులు. మల్లికార్డున్ పాటిల్ బి.సి. సంఘం జిల్లా అద్యక్షులు. రాజేశ్వర్ స్వామి, బి.సి సంఘం ప్రదాన కార్యదర్శి, కూన వేణుగోపాల్, యువజన సంఘాల అధ్యక్షులు, నామాల నాగేష్. రజక సంఘ అధ్యక్షులు, కోంక రాజేశ్వర్, వీరశైవ లింగాయత్ ప్రదాన కార్యదర్శి, గోకుల్ క్రిష్ణ బి.సి. సంఘ నాయుకులు, సాయిలు, కుమ్మరి శాలివహన అధ్యక్షులు బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, గీత వృత్తిదారులు పాల్గొన్నారు.
You may also like
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం
సోమవారం మంగళవారాలాలో జిల్లాలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
శ్రీశైలం నియోజకవర్గం,ఆత్మకూరు,రైతుల శ్రేయోభిలాషి బుడ్డా రాజశేఖర్ రెడ్డి బుడ్డ వెంగళరెడ్డి తనయుడు, ఆదేశాల అనుసారం గురువారం వరకు మార్పుచేయడం జరిగి
వృక్షాలను రక్షిస్తే మనల్ని రక్షిస్తాయి…