ఆభరణాల కోసం వృద్ధురాలు హత్య చేసిన జీవిత ఖైదీ…

ఆభరణాల కోసం వృద్ధురాలు హత్య చేసిన జీవిత ఖైదీ…

 

కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)

ఆభరణాల కోసం ఒక వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష తో పాటు నాలుగు వేల రూపాయల జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మంగళవారం తెలిపారు. 29. 9. 2024 నాడు బీచ్కుంద లో బాలయ్య, అతని భార్య రోజువారి పనులకు వెళ్లగా తల్లి అయిన గోనె కాశవ్వ (58) ఒంటరిగా ఉన్న సమయంలో అదే ఊరుకు చెందిన గుడ్ లింగం పండరి రోకలితో బాది బంగారు ఆభరణాలు దొంగిలించారు అని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కాలనీవాసులను, సాక్షదారాలు పరిశీలించి విచారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అడిషనల్ డిస్టిక్ స్టేషన్స్ (ఎస్సీ, ఎస్టీ కోర్టు నిజామాబాద్) న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితునికి జీవిత ఖైదీ తో పాటు నాలుగు వేల రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. పోలీసుల తరఫున వాదనలు వినిపించి కోర్టుకు సమర్పించి నట్లు తెలిపారు. పోలీస్ అధికారులను అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!