రోటరీ క్లబ్ అఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ లకి సన్మానం …

రోటరీ క్లబ్ అఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ లకి సన్మానం …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఆర్ కె డిగ్రీ కాలేజీ వేదికగా రోటరీ క్లబ్ అఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఫోటో గ్రాఫర్ లని సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ ప్రత్యేక అతిథిగా వచ్చారు వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది అద్భుతమైన కళ అని ఫోటోగ్రాఫర్ లు కళాకారులకు ఏమి తక్కువ కాదు మన స్మృతులని స్మరించుకోడానికి ఫోటోగ్రఫీ ఒక్కటే ఆధారం అని అలాంటి కళాకారులు సమాజం లో ముఖ్య పాత్ర పోషిస్తారు అని అలాగే ఫోటోగ్రాఫర్ లు సమాజంలో నిత్యనూతనంగా అభివృద్ధి సాధిస్తున్నారు అని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, గెస్ట్ అఫ్ హానర్ జైపాల్ రెడ్డి, డాక్టర్ బాలరాజు, స్టేట్ సభ్యులు నవీన్, జిల్లా అధ్యక్షులు అసం శ్రీనివాస్  పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్ లు పాల్గొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!