వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)
*1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.
*2.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.
*3.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలెను.
*4.పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.
*5.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు.
*6.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.
*7.కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.
*8.చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.
*9.ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.
*10.గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.
*11.ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.
*12.ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు “డిష్ ” కనెక్షన్ తీసివేయవలెను.
*13.వర్షం పడుచున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ మోటర్స్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను, లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.
*14.కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.
15.ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి దృష్టికి తీసుకెల్లాలి. ప్రతి కరెంటు వస్తువు కు “ఎర్త్ ” తప్పనిసరిగా గా ఉండాలి.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



