జాతీయ రక్తవీర్ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ బాలు…

అవార్డును అందజేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 20 (అఖండ భూమి న్యూస్)
అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని అశోక హోటల్ లో నిర్వహించిన జాతీయ రక్తవీర్ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు వ్యక్తిగతంగా 77 సార్లు,తలసేమియా చిన్నారుల కోసం నాలుగు వేలకు పైగా రక్తాన్ని సేకరించి అందజేసినందుకు గాను జాతీయ రక్తవీర్ పురస్కారాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త లు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి అందజేయడం జరిగిందని,రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా చిన్నారుల కోసం నిర్వహిస్తామని,ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం మరింతగా కృషి చేస్తానని అన్నారు.ఈ అవార్డు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


