నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం…

నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి;ఆగస్టు 20,(అఖండ భూమి న్యూస్);

నేడు ప్రపంచ వృద్ధుల దినో త్సవం దీనిని ఆంగ్లంలో సీని యర్ సిటిజెన్ డే గా పిలుస్తా రు. ఈరోజు వృద్ధుల సమస్య లు వారి సంక్షేమం గురించి అవగాహన కల్పించడం తో పాటు సమాజానికి వారు చేసి న సేవలు గౌరవం తెలుపు తారు. ప్రపంచ వృద్ధుల దినో త్సవం భారతదేశంలో కూడా పాటిస్తారు.ఈ సందర్బంగా పెద్దలకుగౌరవం,వారినికాపాడు కోవడం,వారి అవసరాలను తీర్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం చేస్తారు.కాబట్టి ఆగస్టు 21 వృద్ధులపట్లగౌరవం చూపే రోజు. సంక్షిప్తంగాచెప్పా లంటేభారతదేశంలో వృద్ధుల నుసంరక్షించడానికిచట్టం,రాజ్యాంగ హామీలు ,పెన్షన్లు, ఆరో గ్య స్కీంలు ఉన్నాయి.పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ ఎక్ట్ 2007 ప్రకారం పిల్లలు వృద్ధుల ను పోషించడం బాధ్యత కలిగి ఉంటారు. వృద్దులు దీని పొం దడం లో విఫలమైతే ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. అవసరమైతే వృద్ధులకు నెల వారి పోషణ కింద బాత్యాలు పొందే వీలుంది. భారత రాజ్యాంగంలోని 41 వ నిబం ధన ప్రకారం వృద్ధులకు సామా జిక భద్రత ఆరోగ్యం కల్పించ వలసిన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. 1999 వృద్ధుల జాతీయ పరిరక్షణ చట్టం వృద్దులకుఆరోగ్యం,ఆహారం,వసతి సామాజిక భద్రత కల్పించే మార్గదర్శకాలు జారీ చేసింది. దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తు న్నాయి. ఇందిరాగాంధీ oనేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కిం ద్వారా 60 ఏళ్ళు పై బడిన వృద్ధులకు నెలవారీపెన్షన్,అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాల ప్రకారం పెన్షన్ అందిస్తున్నాయి.1988 లో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రిగన్ ప్రారంభంచిన ఈ దినోత్సవం 1990 తర్వాత ప్రపంచవ్యాప్తగాజరుపుకుంటు న్నారు.,వారు కుటుంబానికి సమాజానికి, ఇచ్చిన సేవలను గుర్తించి,గౌరవించి సన్మానించ డం,వారి ద్వారా సంస్కృతి, ఆచారాలు కొత్త తరం నేర్చు కోవడం కోసం వారధి గా పని చేస్తాయి. కానీ మారుతున్న కాలం లో విద్యావంతులు సైతం వృద్ధుల ను దూరంగా పెట్టినిరాదరణకుగురిచేస్తున్నా రు.ఆస్తులకు మాత్రమే వార సత్వంగాపొందేందుకుపోటీపడుతున్నారు.పెన్షన్ పైసల కోసం, ఆస్తి కోసం వృద్ధులను చంపేస్తున్నారు.చాలామందిఅనాధాశ్రమంలో చేరుస్తున్నారు. సమాజంలో రోజురోజు కు నశిస్తున్న నైతిక విలువలు ఈ పరిణామాలకు అవకాశం కల్పిస్తున్నాయి. మన ఎదుగు దల కు కారణం అయిన వారి ని ఎదిగిన తర్వాత విస్మరిం చడం ఏ మతం కూడాఒప్పు కోదు,ఏ ధర్మ శాస్త్రం లో కూడా లేదు.ప్రాచీన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అని

చెప్పుకునే మనదేశం లో నిరా దరణ కు గురి అవుతున్న సంఖ్య లక్షల్లో ఉంది .బయటకు వచ్చేవి, నిర్బందంగా నొక్కి వేసేవి ఎన్నో, మనిషి మని రూపం లో ఆలోచించి వృద్ధుల నుభారంగా భావిస్తున్నారు. శ్రావణ కుమారుడు వృద్ధులైన తల్లిదండ్రులను పల్లకి లో మోసి తీర్థయాత్రలు తిప్పినాడు.శివాజీ తన తల్లి నుంచేస్ఫూర్తి పొందినాడు. వృద్దులే సంస్కృతి, చారిత్రకవారసులు, వారిని భారంగా కాకుండ బాద్యత తో సాకుదాం. మని కోసం మంచి మనిషి అనిపించుకుందాం .యద్భావం తద్భావ తే. నీవు వృద్దుల పట్ల అను సరించినదే నీకుజరుగుతుంది. వృద్ధులు కూడా కాలమాన పరిస్థితుల ప్రకారం పిల్లలపై పూర్తిగా నమ్మకుండా వృద్ధాప్యం లో తమకు తాము ఆస్తులుకానీ, నెలసరి ఆదాయం పొందే విధంగా తమ జాగ్రత్తలో తాము ఉండాలి.

Akhand Bhoomi News

error: Content is protected !!