యూరియా పంపిణీ లో అక్రమాలు జరగకూడదు

బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలోని రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీ పై తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, ఆగస్టు 21 అఖండ భూమి న్యూస్) :
జిల్లాలో యూరియా పంపిణీ లో అక్రమాలు జరగకూడదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు.. గురువారం వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం లో రైతులకు యూరియా పంపిణీ పై జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యూరియా పంపిణీ రికార్డులను పరిశీలించారు.. గ్రామానికి ఇప్పటి వరకు ఎంత యూరియా వచ్చింది, రైతులకు ఎలా పంపిణీ చేశారు అని రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు..ఆన్లైన్ వివరాలతో పాటు ఆఫ్లైన్ లో ఏ రైతుకి ఎంత ఇచ్చారు అని వివరాలను రిజిస్టర్ లో ఎంట్రీ చేయడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు…..ఇంకా ఎంత మేరకు యూరియా అవసరం ఉందని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారిని ఆరా తీశారు .. 300 బ్యాగ్ ల యూరియా ఈ గ్రామానికి అవసరం ఉందని మండల వ్యవసాయ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. యూరియా వచ్చిన వెంటనే ఈ గ్రామానికి 300 బ్యాగ్ లు పంపించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు… యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు సజావుగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు..
ఇప్పటివరకు మండలంలో ఎంత మేరకు ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేశారని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారిని ఆరా తీశారు.. మండలంలో 2 వేల ఎకరాల వరకు ఈ క్రాప్ బుకింగ్ పూర్తి అయిందని, ప్రతి రోజు ఒక వ్యక్తికి 50 ఎకరాల మేరకు ఈ క్రాప్ బుకింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల వ్యవసాయ అధికారి వివరించారు.. సెప్టెంబర్ 15 వ తేది నాటికి ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు.. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా , తదితరులు పాల్గొన్నారు.


