మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 22. (అఖండ భూమి న్యూస్)
నేరానికి సంబంధించి సంఘటన స్థలంలోని సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను గుర్తించడంలో ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కామారెడ్డి జిల్లా కు నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర. జిల్లా పోలీసు కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ…. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, అత్యాధునిక పరికరాల తో రూపోందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాని కామారెడ్డి జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకోని సంఘటన జరిగిన స్థలం నుండి పలు రకాల సాక్ష్యాదారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేసారు.
ఈ కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మరియు ఎస్ఐలు, , క్లూస్ టీమ్, తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



