10 కే ప్యాంటు..షర్టు.. ఇంస్టాగ్రామ్ లో ప్రచారం..
-షాపు వద్దకు వేలాదిగా తరలివచ్చిన కొనుగోలుదారులు..
-కట్టడి చేసేందుకు స్వల్ప లాఠీచార్జి..
-అనుమతి లేకుండా ఇంస్టాగ్రామ్ లో ప్రచారం..
-దుకాణాన్ని సీజ్ చేసిన పోలీసులు..
-యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
-సీఐ సత్యనారాయణ సమయానికి రాకపోతే అనర్థం జరిగేది..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్ట్ 21: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్,
ఆగస్టు 21: గంట వ్యవధిలో రూ.10కి నచ్చిన ప్యాంటు, షర్టు, కొనుగోలు చేయాలని దుకాణ యజమాని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో కొనుగోలు దారులు వేలాదిగా తరలివచ్చారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద గల ఆర్ కే కాంప్లెక్స్ వెనుక గల మన ఫంకి బాయ్స్ యజమాని ఇంస్టాగ్రామ్ లలో గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రూ. 10కి ప్యాంటు, షర్టు, ఏదో ఒకటి కొనుగోలు చేయవచ్చని విస్తృత ప్రచారం చేశారు. ఉదయం 10 గంటలకే వేలాది మంది యువకులు తరలివచ్చారు. మహిళలు సైతం పదికి ప్యాంటు, షర్టు కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. ఆర్ కే కాంప్లెక్స్, అంబేద్కర్ చౌరస్తాలో వేలాది మందితో నిండిపోయి జనసందోహాన్ని తలపించింది. దుకాణ యజమాని షట్టర్ తీస్తే జనం ఎగబడి తొక్కిసలట జరిగే ప్రమాదం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ గౌడ్ ఆర్ కే కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ఒకే చోట గుమ్మిగూడిన జనాన్ని వెళ్లిపోవాలని చెప్పిన జరగకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయడంతో జనం దుకాణం వద్ద నుంచి పరుగులు తీశారు. పోలీసుల అనుమతి లేకుండా 10కే షర్టు, ప్యాంటు, ఏదైనా ఒకటి కొనుగోలు చేయవచ్చని ప్రచారం చేయడం పట్ల పోలీసులు సీరియస్ అయ్యారు. సకాలంలో సీఐ సత్యనారాయణ గౌడ్ చేరుకోకపోతే ఒక దశలో తొక్కిసలాట జరిగే అవకాశం ఏర్పడేది. పోలీసులు ముందుగా చేరుకొని పరిస్థితిని చక్కదిద్దడంతో ప్రమాదం తప్పింది. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా రూ. 10 కే షర్ట్ ఇస్తామని ఇంస్టాగ్రామ్ లో ప్రచారం చేసిన దుకాణ యజమానిని పోలీసులు అదుపులో తీసుకొని దుకాణానికి తాళాలు వేసి సీజ్ చేశారు. అనంతరం యజమానిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



