నందమూరి బాలకృష్ణకు వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్!…

నందమూరి బాలకృష్ణకు వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్!…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)

లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకటి ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రదానం చేస్తున్నారు. భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతుంది.

50 ఘనమైన సంవత్స రాలు హీరోగా కొనసాగిన అద్భుతమైన మైలురాయి ని రికార్డ్ గా గుర్తించారు. ఇది ప్రపంచ సినిమాల్లో కూడా అత్యంత అరుదైన సంఘటన. బాలకృష్ణ గత కొన్నాళ్లుగా దూసుకుపోతు న్నారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మూడు వంద కోట్ల సినిమాలు సాధించారు.

ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్‌తో సత్కరించ బడ్డారు. ఇలా బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చి చేరింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ సంతోష్ శుక్లా జారీ చేసిన అధికారిక ప్రశంసలో.. బాలకృష్ణ ఐదు దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా నిలిచి భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్‌మార్క్‌ను స్థాపించినందుకు…

సిల్వర్ స్క్రీన్‌కు మించి ఆయన గొప్పతనం విస్తరించి గత 15 సంవత్స రాలుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా ఆయన అందిస్తున్న సేవలకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన పేరుని చేరుస్తున్నట్టు ప్రకటించారు.

ఇక ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణని చేర్చినట్టు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ ఆగస్టు 30వ తేదీన హైదరా బాదు లో స్వయంగా బాల కృష్ణకు అందిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!