రక్తదాన శిబిరం విజయవంతం…

రక్తదాన శిబిరం విజయవంతం…

24 యూనిట్ల రక్తం సేకరణ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వర్ణయుగ శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయంలో ఈ రోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),కామారెడ్డి రక్తదాతల సమూహం,రెడ్ క్రాస్ సొసైటీ ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు,ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,18 సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇప్పటి వరకూ 4 వేలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి అందజేయడం జరిగిందని అన్నారు.ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న సాయిమిత్ర సిండికేట్ సభ్యులకు,రక్తదాతలందరికీ ప్రశంస పత్రాలను అందజేసి సన్మానించడం నిర్వహించడం జరిగింది. స్

ప్రపంచంలో వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని అన్నారు. రక్తదాతలు ప్రాణదాతలే అని,రక్తదాతల సేవలు వెలకట్ట లేనివని అన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,డాక్టర్ వేదప్రకాష్, గంప ప్రసాద్,పర్శ వెంకటరమణ లు పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!