వినాయక మండపాలకు లడ్డూలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…

వినాయక మండపాలకు లడ్డూలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26 (అఖండ భూమి న్యూస్)

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వినాయక మండపలకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ తరపున మంగళవారం లడ్డులు పంపిణి చేసారు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలను తీసుకురావాలని షబ్బీర్ అలీ ఆశభావం వ్యక్తం చేసారు. వినాయక చవితి అనేది భక్తి సంస్కృతి మరియు ఐక్యతను చాటిచెప్పే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని షబ్బీర్ అలీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!