ఎన్నో అర్థాలు,. పరమార్థాల పండుగే వినాయక చవితి ..!

ఎన్నో అర్థాలు,. పరమార్థాల పండుగే వినాయక చవితి ..!

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26,(అఖండ

భూమి న్యూస్)

వినాయక పండుగ విశిష్టత.

గణపతి కేవలం గణాలకు మాత్రమే అధిపతి కాదు, ఘన మైన దేవుడు ఈసృష్టి యావత్తు గణాలతో కూడిన మహాగణమే ఈ గణాలన్నింటిలో అంతర్యా మిగా ఉంటూ సృష్టిని శాసించే మహా శక్తివంతుడు. అందుకే గణపతికి ఘనంగా పూజలు చేస్తారు. ఆయన ఘనులకే ఘనుడు.గణపతి తన పుట్టుక విచిత్రం ,అంటే ఆయన ఆకృతి మరీ విచిత్రం అయితే ఏ పూజ చేసినాఏ కార్యక్రమం నిర్వహిం చిన గణపతికి అగ్రపూజ చేయ డం, తల్లిదండ్రులకు మించిన దైవంలేదని నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని విజ్ఞాది పత్యాన్ని పొందిన సూక్ష్మ గ్రహి.తండ్రి లాగే ఇయనకు ఆకారం కల్పించడం, పూజించడం, ప్రసన్నం చేసుకోవడం సులభమే. దోసెడు మట్టి చిటికెడు పసుపు ఉంటే చాలు ఆకారం తయారు చేయవచ్చు గుప్పెడు గరిక , కనువంత బెల్లం ముక్క ఉంటే చాలు ఘనంగా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించుకోవచ్చు. సర్వ విఘ్నాలను తొలగించి కోరిన వాటిని ప్రసాదించే ఆ గణపతి ఉదార స్వభావం కలవాడు ఇంతటి మహిమాన్వి మైన గణపతి యొక్క విశేషా లను తెలుసుకుందాం గణపతి అంటే జ్ఞానం , మోక్షం యొక్క ప్రదాత మనిషిని సన్మార్గంలో నడిపేది జ్ఞానమైతే జన్మరాహిత్యం కల్పించేది మోక్షం. గణపతి ఆవిర్భావం రూపురేఖలు విలాసాల గురించి పురాణ ఇతిహాసాలు అనేక అనేక విధాలుగా వివరించిన ప్పటికీ, అనేక శాస్త్రాలు పరబ్రహ్మ స్వరూపంగాను, భవిష్యత్ బ్రహ్మగాను పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం విజ్ఞ సంహకుడు. గణం అంటే సమూహం అని అర్థం సృష్టి యావత్తు గణాల మయం అనేక మహాగణాలతో కూడినది విశ్వం మనుష్య గణం, వృక్ష గణం,గ్రహగణం ఇందులో దర్మా లను బట్టి మరెన్నో గణాలు ఈ గణాలన్నింటిలో అతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించే పర మేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతి మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారం గణపతి బ్రహ్మ సూచనను అనుసరించి వేదవ్యాసుని శబ్దానికి గణపతి రూపు నిచ్చాడు. డఅంటే మహాభారత రచనను వేదవ్యాసుడు చెపుతుండగా తనదంతంతో రాసినట్లు పురాణాలు చెపుతున్నాయి. ఇంద్రుడు, భగీరథుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు,దమయంతి సంబుడు,ధర్మరాజు గణపతి ని ఆరాధించినట్లు తెలుస్తుంది. ఆది పూజ ఎందుకు ఏ పూజ చేసిన తోలుత గణపతిని ప్రార్థించిన తర్వాతే ఇతరుల ను ప్రార్థించాలి లేకపోతే పూజ నిష్ప్రయోజనం అవుతుంది, గణపతిని పూజించి నట్లయితే సిద్ధి ,బుద్ధి తోపాటు” క్షేమం లాభం “సిద్ధిస్తాయని స్వయం గా పార్వతీ పరమేశ్వరులే గణపతికి వరమిచ్చినట్లు పురాణ ఇతిహాసాలు బోధిస్తున్నా యి.వినాయకుడు వివాహే తుడేనా వినాయకుడు హస్తి ముఖుడు. హస్తం అంటే తుం డం హస్తం కలిగింది. ఏనుగు రూపాన్ని చూసి మనం గమ నించాల్సింది ఈయన ఏనుగు ముఖం వాడు అనే విశేషణం కాదు, ఈయన జన్మ నక్షత్రం హస్త ఇది కాన్యరాశికి చెందిం ది.కాబట్టిఈయనఅవివాహితుడుఅయ్యాడు.అయితే ఈ లో కంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత సిద్ధించదు కాబట్టి వినాయకు నికి “సిద్ది బుద్ధి” క్షేమం లాభా న్ని సంతా నంగా పేర్కొంటారు. పూజ వల్ల ప్రయోజనం ఏమిటి? వినాయ కుడిని పత్రి తో పూజిం చ డం లో కొన్ని రహస్యాలు ఉన్నా యి.పత్రి పూజ వల్ల ప్రయో జనం ఏమిటి?దీనిలో కొన్ని రహస్యాలు ఇమిడి ఉన్నాయి విగ్నేశ్వరపూజకుమాచాపత్రి,ములక,మారేడు,ఉమ్మెంత,గరిక,ఉత్తరేణి,తులసి,విష్ణుక్రాంత,దానిమ్మ ,రేగు,దేవదారు, గన్నే రు,మరువం,వావిలి,జాజి,జమ్మి,రవి,మద్ది,జిల్లేడు ఈ 21 రకాల ఆకులు ఔషద గుణాలు కల్గినవి.ఈ ఔషధ మొక్కలను త్రాకడం,వాటిని త్రుంచి సేక రించడం వల్ల వాటిలోని ఔషధ విలువలను మనం పొంద గలం.తులసి,మారేడు,ఉత్తరేణి ఆకులను స్పృ శించడం వల్ల చర్మ వ్యాధులు దూరం అవుతాయి.మెదడు ఉత్తేజితం అవుతుంది.విశేష నాయకుడు ఆకారాన్ని,ఉకారన్నీ,మకారాన్ని కలిపి ఓంకారం అనే శబ్దం రూపొందించారు దేవతలు.మొదట కనిపించిన విజ్ఞనివారక దైవానికి ఈ వేదాల ద్వారా ఏర్పాటు చేసిన ఓంకారాన్ని ఏర్పాటు చేసిన ప్రకారం ఓం అంటే గణేషుణ్ణి ప్రార్తించడం అన్నమాట అందుకే అష్టోత్తర శతనమవాలి పాటించే ముందు ప్రతి నామనికి ముందు ఓంకారం చేర్చినారు. ఓంకారం లేకుండా ఉచ్చారణ చేస్తే మంత్ర అక్షర తత్వమే ఉంటుంది కానీ మంత్ర తత్వం ఉండదు.ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తే గణపతి ని ప్రార్థించినట్లు,ఓం అని మన పూజ మందిరంలో రాస్తే వినాయక చిత్రాన్ని మనకు వచ్చిన నైపుణ్యం తో గీసినట్టు అవుతుందన్నమాట ఎలుక వాహనం ఏం చెప్తుంది. వినాయకుడి వాహనం మూషికం “ముషస్తయే” అనే ధాతువు మీద మూషకము లేదా మూషికము అనే మాట ఏర్పడింది దీనికి ఎలుక అని అర్థం.ఎలుకను పరిశీలిస్తే చలిస్తూనే ఉంటుంది.ఏ క్షణం కూడా కదలిక లేకుండా ఉండేది ఎలుక,నిచ్ఛలంగా కూర్చున్న ప్పుడు కూడా,మూతినో తలనో,కల్లనో కదిలిస్తూనే ఉండే లక్షణం దానిది.ఇక రెండవది ఎక్కడి నుండో దొంగలిచ్చిన బొరియలో దాచిపెట్టుకునే లక్షణం దానిది.ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటే ఎవరు అయిన సరే దొంగబుద్ధితో దాచకు,అనుభవించకుండా కుంచితతత్వం తో నిల్వ ఉంచుకునే తత్వాన్ని నియంత్రించుకుంటే విజ్ఞానలు నీ దారి చెరువు.విజయం నీ చెంత నుంచి దారి మల్లదు అనే సంకేతార్థం.పత్రి అంటే వినాయకుడికి ఎందుకు అంత ప్రీతి.వినాయకుడి జన్మరాశి అయిన కాన్యరాశికి అధిపతి బుధ గ్రహం.ఇయన ఆకుపచ్చగా ఉంటాడు. అందుకే వినాయకుడికి పత్రి తో పూజ ఇష్టం.ఆయన అది నుంచి ప్రకృతి ప్రియుడు గడ్డి జాతి మొక్కల ద్వారానే ఆయ నకు అసలసూరిడి బాధ నుం చి ఉపశమనంకల్గింది.అందుకే గరికె అంటే ఇష్టం.పాలవెళ్లి ఎందుకు?జ్యోతిస్సు అంటే గ్రహాలు,నక్షత్రాలు అన్ని ఆకా శం లొనే ఉంటాయి.ఈ జ్యోతి స్సు ఆధారంగా ఏర్పడిందే జ్యోతిష్య శాస్త్రం. కాబట్టి ఈ రహస్యాన్ని విశిధీకరిం చేందు కు వినాయక చవితి నాడు వినాయకుని పై భాగంలో చత్రసాకారంలో ఒక జల్లెడ లాంటి ఆకారాన్ని వెదురు బద్దలతో ఏర్పాటుచేసి, వెలగ బత్తాయి పండు,కూరగాయలు వంటి వాటిని వేలాడదీస్తారు.

మెదడుఉత్తేజితంఅవుతుంది.విశేష నాయకుడు ఆకారాన్ని ఉకారన్నీ,మకారాన్ని కలిపి ఓంకారం అనే శబ్దంరూపొందిం చారుదేవతలు.మొదటకనిపిం చిన విజ్ఞనివారక దైవానికి ఈ వేదాల ద్వారా ఏర్పాటు చేసిన ఓంకారాన్ని ఏర్పాటు చేసిన ప్రకారం ఓం అంటే గణేషుణ్ణి ప్రార్తించడం అన్నమాట.అందు కేఅష్టోత్తరశతనమవాలిపాటిం చే ముందు ప్రతి నామనికి ముందు ఓంకారం చేర్చినారు. ఓంకారం లేకుండా ఉచ్చారణ చేస్తే మంత్ర అక్షర తత్వమే ఉంటుంది కానీ మంత్ర తత్వం ఉండదు.ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తే గణపతి ని ప్రార్థించి నట్లు,ఓం అని మన పూజ మందిరంలో రాస్తే వినాయక చిత్రాన్ని మనకు వచ్చిన నైపు ణ్యంతోగీసినట్టుఅవుతుందన్న మాట ఎలుక వాహనం ఏం చెప్తుంది. వినాయకుడి వాహ నం మూషికం “ముషస్తయే” అనే ధాతువు మీద మూషక ము లేదా మూషికము అనే మాట ఏర్పడింది. దీనికి ఎలుక అని అర్థం.ఎలుకను పరిశీలిస్తే చలిస్తూనే ఉంటుంది.ఏ క్షణం కూడా కదలిక లేకుండా ఉండే ది.ఎలుక,నిచ్ఛలంగాకూర్చున్న ప్పుడు కూడా,మూతినో, తల నో,కల్లనో కదిలిస్తూనే ఉండే లక్షణం దానిది.ఇక రెండవది ఎక్కడి నుండో దొంగలిచ్చిన బొరియ లో దాచిపెట్టుకునే లక్షణం దానిది.ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటే ఎవరు అయిన సరే దొంగబుద్ధితో దాచకు,అనుభవించకుండా కుంచితతత్వం తోనిల్వఉంచు కునే తత్వాన్ని నియంత్రించు కుంటే విజ్ఞాలు నీ దారి చెరు వు.విజయం నీ చెంత నుంచి దారిమల్లదు.అనేసంకేతార్థం.పత్రి అంటే వినాయకుడికి ఎందుకుఅంతప్రీతి.వినాయకుడి జన్మరాశిఅయినకాన్యరాశికి అధిపతిబుధగ్రహం.ఇయనఆకుపచ్చగా ఉంటాడు. అందుకే వినాయకుడికి పత్రి తో పూజ ఇష్టం.ఆయన అది నుంచి ప్రకృతి ప్రియుడు గడ్డి జాతి మొక్కల ద్వారానే ఆయనకు అసలసూరిడి బాధ నుంచి ఉపశమనం కల్గింది.అందుకే గరికె అంటే ఇష్టం.పాలవెళ్లి ఎందుకు?జ్యోతిస్సు అంటే గ్రహాలు,నక్షత్రాలు అన్ని ఆకాశం లొనే ఉంటాయి.ఈ జ్యోతిస్సు ఆధారంగా ఏర్ప డిందే జ్యోతిష్య శాస్త్రం. కాబ ట్టి ఈ రహస్యాన్ని విశి ధీక రించేందుకు వినాయక చవితి నాడు వినాయకుని పై భాగం లో చత్రసాకారంలో ఒక జల్లెడ లాంటి ఆకారాన్ని వెదురు బద్ద లతో ఏర్పాటుచేసి వెలగ,బత్తా యి పండు కూరగాయలు వంటి వాటిని వేలాడదీస్తారుబంకమట్టే ఎందుకు గణేశ పూజకు ఓండ్రు మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమ ను ఉపయోగించడం ఎందుకంటే వాగు లు కాలువలు నదులు మొదలైన జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి బంకమట్టి కోసం ఆయా జలాశయాల్లో దిగి తమ కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది నీళ్లు తేటపడతాయి మట్టిని తాకడం వల్ల దాంతో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి ఓండ్రు మట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎలా చెప్పారు పూజ అనంతరం ఆయా మట్టి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాల్లోని ఔషధ గుణాలు సంతరించుకుంటుంది నిమజ్జనం ఎందుకు భూమి నీటిలో నుంచి పుట్టింది ఆ భూమి తోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి దానికి ప్రాణ ప్రతిష్ట ద్వారా వాహనాది షోడోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సాంప్రదాయం అలా ఎందుకంటే భూమి నుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగిన తిరిగి భూమిలో కలిసిపోతుంది అన్న సత్యాన్ని చాటేందుకే. దేని మీద వ్యామోహం పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే వినాయకుని పూజ చేస్తే నిజంగా విజ్ఞానం తొలుగుతాయా విశేషంగా పనిని ప్రారంభించిన వ్యక్తి శారీరక మానసిక ధైర్యాన్ని నాశనం చేసేది విశేషణ కార్య సామర్థ్యం హంతితి విజ్ఞ:అని, విజ్ఞ పదానికి అర్థం మన పూర్వ జన్మలో చేసుకున్న పాపాల కారణంగా రావలసిన విజ్ఞా ఏమేమి ఉన్నాయో వాటన్నింటి తొలగించగల శక్తి ఏ భగవంతుడికి లేదు అలాగే తొలగింప చేయగలిగిన వాళ్ళు అయితే ప్రతి వాళ్లు నిత్యం పూజ పునస్కరాల్లో మునిగి అసలు విజ్ఞాలే రాకుండా చేసుకునే వాళ్ళు ఇప్పుడు తమలో కూడా చేసిన పాపాలకు శిక్ష అనేది లేకుండా పోయేది కూడా ఇది లోక రక్షణ వ్యవస్థకు విరుద్ధం మరి వినాయకుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థించిన పక్షంలో సర్వ విఘ్నోప శాంతయే రావాల్సిన విజ్ఞానంతో మనకేమన్నాయో ఆ విఘ్నాలు మనకి సంప్రాప్తి ఇచ్చిన వేళా మానసిక ఉపశాంతి ఇచ్చి జీవితం మీద విరక్తి కలగకుండా కొంత ధైర్యంతో ముందుకు అడుగు వేసేలా చేస్తాడన్నమాట అంటే విజ్ఞానం అనేది కాలానికి సం బంధించిన కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క కాలంలో జీవిత దశ లో వచ్చేది కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క కాలంలో జీవిత దశ లో వచ్చేది కాబట్టి ఆ కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న వినాయకుని ప్రార్థించి విజ్ఞానం నుండి దూరం కావాల్సింది గా ను ఒకవేళ విఘ్నమే తప్పని సరి వస్తే తట్టుకో గలిగిన మాని మానసిక స్థైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించడం ద్వారా కొంత మానసిక ధైర్యం ఇవ్వ వలసిందిగా ఈ పండుగ మనకు బోధిస్తుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!