వినాయకునికి గరిక ఎందుకు పెడతారు? 

వినాయకునికి గరిక ఎందుకు పెడతారు?

 

లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26(అఖండ భూమి న్యూస్);

వినాయకునికి గరిక దుర్వా పెట్టడం ఒక ముఖ్యమైన ఆచారం దీనికి ఆధ్యాత్మిక పౌరాణిక ఔషధ కారణాలు ఉన్నాయి

1.పౌరాణిక కారణం… గణపతి వ్రత కథల ప్రకారం ఒకసారి గణపతి మీద అసలా సురుడు అనే అసురుడు దాడి చేశాడు. అతని వేడి అగ్నిలా ఉండేది.ఆ వేడిని తగ్గించేందు కుఋషులు గరికను సూచించారు. గరిక గడ్డిని వినాయకుని తలపై ఉంచగానే ఆయనకు శాంతి కలుగుతుంది. అప్పటి నుండి గరిక వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది.

1.ఆధ్యాత్మిక కారణం.. గరిక గడ్డి మూడు రెమ్మలతోఉంటుం ది ఇది సత్యం, శాంతి జ్ఞానములకు ప్రాతికగా భావిస్తారు. దుర్వ గడ్డిని రాడంబరతకు ,విశ్వాసనీయతకు ప్రాతిక దీన్ని మనం సమర్పించడం ద్వారా ము స్వచ్ఛతను చూపుతాం.

2.ఔషధ కారణం. గరిక గడ్డికి శీతల గుణం ఉంది ఇది వేడిని తగ్గిస్తుంది.గణపతికి గరిక పెట్టడం వల్ల ఆయనకు శాంతి లభిస్తుంది. ఆ శాంతి మనకు ఆరోగ్యకరంగా మారుతుందని

ప్రతీతి.

3.ఆచార పరంగా.. గరిక లేకుం డా వినాయక పూజ సంపూర్ణం కాదు. అందుకే 21 కానీ 108 గరికలు వినాయకునికి సమర్పిస్తారు.

4.వినాయకునికి గరిక సమర్పించే విధానం… వినాయకునికి పుష్పాలు అక్షతలు సమర్పిం చిన తర్వాత గరిక అర్పించాలి ప్రతి రెమ్మన సమర్పిస్తూ “ఓం గణేశాయ నమః “లేదా” ఓం గం గణపతయే నమః” అని జపించాలి. గణపతి విగ్రహం లేదా బొమ్మ తలపై తొండంపై కర్ణములపై ఉంచాలి కొన్నిచోట్ల తొండం కుడివైపు ఉంటే కుడిచేవికి ఎడమవైపు ఉంటే ఎడమచేవికి గరిక వేస్తారు. గరికను పూజకు ముందు రోజు లేదా పూజ రోజే ఉదయం గరిక గడ్డి తెచ్చుకోవాలి. గరికను శుభ్రం గా కడిగి నీడలో అరబెట్టాలి. 21 లేదా 108 లేదా 1008 రెమ్మలుగా గరిక సమర్పించా లి. సాధారణంగా 21 గరికల తో కూడా పూజ పూర్తవుతుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!