జిల్లా ప్రజలు భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్…

జిల్లా ప్రజలు భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్…

జిల్లా యంత్రాంగం తో పాటు బృందాలు ఏజిల్లా ప్రజలు భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్…ర్పాటు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 27 (అఖండ భూమి న్యూస్)

భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్రస్థాయి నుండి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

జిల్లాలో వరుసగా కురుస్తున్న అధిక వర్షాల వలన జిల్లా వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యాములు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయని నీటి వనరుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లరాదని సూచించారు. అదేవిధంగా అత్యవసరం అనుకుంటే తప్ప ఎట్టి పరిస్థితులలో ఈ భారీ వర్షాల సమయంలో ప్రయాణాలు చేయరాదని ముఖ్యంగా వాగులు, నదులు, ఒర్రెల వద్ద బ్రిడ్జిలపై నుండి ప్రయాణించేటప్పుడు ఒకసారి ముందు నీటి ప్రవాహంలో పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే వెళ్లాలని, ప్రభుత్వ అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు, పాత భవనాలకు, పాటుపడ్డ ఇండ్లకు దూరంగా ఉండాలని సూచించారు. చేపల వేటకు వెళ్లరాదని, పొలాలకు మరియు పశువులను మేపేందుకు వాగులు, ఒర్రెలు దాటి వెళ్లరాదని ప్రజలకు సూచించారు. జిల్లా ప్రజలను వరదల సమయంలో ఆదుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, రాష్ట్రస్థాయి నుండి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడ్డ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468-220069 సమాచారం అందించాలని లేదా సమీప అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.

అధికారులు కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండి ఈ భారీ వర్షం సమయంలో ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. లో లెవెల్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి పునరావస్వం కల్పించాలని, లో లెవెల్ కాజ్వేలు, బ్రిడ్జ్ లో పైనుండి ప్రజలు ప్రయాణం చేయకుండా బారికెట్స్ ఏర్పాటు చేయాలని, ప్రమాదకరంగా ఉన్న నీటి వనరుల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వరదల సందర్భంగా ప్రజలను రక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి కూడా ప్రత్యేక బృందాలు జిల్లాకు వస్తున్నాయని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!