గణపతి బప్పా మోరియా” అంటే ఏమిటి …

గణపతి బప్పా మోరియా” అంటే ఏమిటి …

 

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 27 ,(అఖండ భూమి న్యూస్ ).;

వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ

మోరియా* అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు.

మరి *మోరియా* అనే మాట నినాదంగా ఎలా మారింది?

ఆ పదానికి గల అర్థంఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం…

మోరియా అసలు కథ:

15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవా డు. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ దాన్ని తీసుకు వచ్చిప్రతిష్టించమనిచెప్పాడట

కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసు కోవడానికి మోరియా అక్కడు న్న నదికి వెళ్లాడు.కలలోగణప తి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. ఈవిషయం తెలుసుకున్నస్థానికులుమోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతేసాక్షాత్తువినాయకుడు కలలోకనిపిస్తాడుఅంటూ.. మోరియాను చూసేందుకు తండోపతండాలుగావచ్చారట.

మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలు పెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారటనది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు.

మోరియా* గొప్ప భక్తుడు అయ్యాడు. కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణప తిఉత్సవాల్లోబాగమైపోయింది

ఆనాటి నుంచి గణపతిబప్పా మోరియాఅనే నినాదం నిర్వి రామంగా విన బడుతూనే ఉంది.భక్త వల్లభుడైన వినాయ కుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం. చేసే ముం దు గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా అని మరాఠీ లోని నదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణేసమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు. అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.

Akhand Bhoomi News

error: Content is protected !!