ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట బద్దత కల్పించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే

ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట బద్దత కల్పించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే

-మహజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్!

స్టేట్ బ్యూరో మే 14 (అఖండ భూమి) : ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట బద్దత కల్పించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే నని

-మహజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, జాతీయ వ్యవస్థాపకులు ముఖ్య అతిథులుగా హాజరయి కానున్నారు. మే 18న ఛలో డోన్, ఉమ్మడి కర్నూలు జిల్లాల

సభను జయప్రధము చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ పిలుపునిచ్చారు. డోన్ పట్టణం నందు

ఉదయం 11-00 గం. లకుమాదిగ మరియు ఉపకులాల ప్రజలారా.! మహాజనులారా!! ప్రజాస్వామికవాదులారా!!!

దేశంలోని పీడిత వర్గాలన్ని

దిక్చూచిగా నిలబడగల నినాదం ఏదైనా భారతదేశానికి

దిక్చూచిగా నిలచే విధంగా,

సామాజిక న్యాయం అనే పదానికి

గర్వపడేలా ఎమ్మార్పీఎస్ ఉద్యమం గత 29 సంవత్సరాలుగా

నడుస్తుందిని తెలిపారు.

దేశంలో ఎవరి జనాభా ఎంతో వారికి

వారి జనాభాకు తగ్గ ఫలాలు, ఫలితాలు అన్ని రంగాల్లో దక్కాలి అనేదే అందులో భాగంగా ఎస్సీలలో ఉన్న 59 కులాలకు రిజర్వేషన్ల ఫలాలు కూడా వారి వారి జనాభాకు తగ్గట్లుగా అందాలని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై గత 29 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం ఎమ్మార్పీఎస్

ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ తెలుగు నేలమీద మొదలైన ఈ ఉద్యమం తెలుగునేల సరిహద్దులు దాటి దక్షిణాది రాష్ట్రాలు దాటి ఉత్తరాది. రాష్ట్రాలలో కూడా విస్తరించి, ఈ రోజు దేశవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ విస్తరించిందని దళితుల్లో అట్టడుగున ఉన్న ఇప్పటికి రిజర్వేషన్లలో తమ న్యాయమైన వాటాను పొందలేని కులాల ప్రజలు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకై ఎన్నో రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకై జరుగుతున్న ఈ

ఉద్యమానికి తెలుగు నేల మీదనే కాకుండా ప్రతి రాష్ట్రంలో బిజెపి సమర్ధిస్తూనే వస్తుంది. అలాగే ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం, డిఎంకె, ఎఐడిఎంకె, జెడిఎస్, జెడియు, ఎనిసిపి, శివసేన, అకాళిదల్ మరియు ఆప్తో బాటు టిఆర్ఎస్, వైఎస్ఆర్ఎసిపి, మెజార్టీ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూనే ఉన్నాయి.

అవసరమైన ఎన్నో బిల్లులు పార్లమెంట్లో ఇష్టానుసారంగా ఆమోదించుకుంది. ముఖ్యంగా అయితే ఈ తొమ్మిదిన్నర ఏండ్ల బిజెపి పాలనలో వాళ్లకు త్రిపుల్ తలాక్ రద్దు. జి.ఎస్.టి.. పౌరసత్వ సవరణ, 10% ఈబిసి రిజర్వేషన్, 370 ఆర్టికల్ రద్దు వంటి మొదలగు మరెన్నో బిల్లులు ఆమోదించుకుంది. అయితే వీటికోసం ఎక్కడ బలమైన ప్రజా ఉద్యమాలు కూడా జరగలేదు. అయినప్పటికి పార్లమెంట్లో బిల్లులు పెట్టి నెగ్గించుకున్నారు. కానీ

ఎస్సీ వర్గీకరణకోసం మాదిగలు సంవత్సరాలుగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి 29 సంవత్సరాలుగా బిజెపి మద్దతు తెలిపి, కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీలు ఇచ్చి అలాగే ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని, తీరా అధికారంలోకి వచ్చాక నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తు మాదిగల ఆశల మీద నిప్పులు

పోస్తుంది. ఇది మాదిగలకు బిజెపి

చేస్తున్న పచ్చి నమ్మక ద్రోహమే తప్ప మరొకటికాదు. తిరుపతిలో తీసుకున్న నిర్ణయాలే మన ముందున్న ప్రథమ కర్తవ్యం పెట్టుకొని ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్లాలి. పట్టణాల్లో ఉన్న బస్తీలను

(పేటలను) ప్రత్తి మండల పరిధిలో ఉన్న పల్లెలను ఉద్యమానికి పునాదులుగా మార్చండి. మనం అనుకున్న విధంగా 50 రోజుల టార్గెట్ను 100% పూర్తి చేయగలిగితే మనం మును ముందు మరో శక్తి వంతమైన ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళమవుతాం. అది భవిష్యత్తులో రాజకీయ పునాదులను ఏర్పరచుకోవడానికి కూడా దారి తీస్తుంది. ఇందుకోసం అహర్నిశలు శ్రమించడం ద్వారానే

మనం మన లక్ష్యాలను చేర్చుకున్న

వాళ్ళమవుతామనేది గుర్తు చేస్తున్నాను. అందుకోసం సమయం వెచ్చించి శ్రమించడం తప్ప మరో ధ్యాస ఉండొద్దని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. ప్రతి నాయకుడు లేదా నాయకురాలు ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రతి బృందం ప్రతిరోజు రెండు గ్రామాలకు వెళ్లాల్సిందే వీలైతే మూడు గ్రామాలకు వెళ్లడం కూడా పెట్టుకోండి – మందకృష్ణ మాదిగ. ప్రతి గ్రామంలో లేదా పేటలో సమావేశాలు పెట్టడం నిర్మాణం చేయడం పోరాటానికి ప్రతి గ్రామంలో ఉన్న మన ప్రజలను సిద్ధం చేయడం ప్రతి బృందం చేయాల్సిన ప్రధాన కర్తవ్యంగా గుర్తించాలి – మందకృష్ణ మాదిగ. మనం తీసుకున్న ఈ టార్గెట్ 50 రోజుల కర్తవ్యాన్ని ఎవరు సీరియస్ గా తీసుకొని పనిలో ఉన్నారని గుర్తించడానికి అతి త్వరలో జూమ్ సమావేశాలు మొదలవుతాయి. ఆ సమావేశాలు వారానికి రెండు రోజులు ఉంటాయి. ఒకరోజు

ఆంధ్రప్రదేశ్క మరొక రోజు తెలంగాణలో జరుగుతున్న పని విధానాలపై సమీక్షలు ఉంటాయి. అందుకోసం నిర్దిష్టమైన తేదీలు కూడా తెలియజేస్తాను మందకృష్ణ మాదిగ. మనకు అన్ని విభాగాల్లో ఎదిగిన ప్రథమ శ్రేణి నాయకత్వం తమ పని విధానం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఆదర్శంగా నిలవాలి. అందుకోసం ప్రథమ శ్రేణి నాయకత్వం పూర్తి సమయం వెచ్చించి పనిలో ఉండాలి – మందకృష్ణ మాదిగ. గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ ద్వారా మనం 50 రోజుల టార్గెట్ను సంపూర్ణంగా పూర్తి చేయగలిగితే మనం దేశానికి ఆదర్శవంతమైన మహోన్నతమైన ఉద్యమాలకు కేంద్ర బిందువుగామారి నూతన చరిత్రను కూడా లిఖించిన వాళ్ళమవుతాం – మందకృష్ణ మాదిగ. మే 18న “ఛలో డోన్”, ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల సభను విజయవంతం కోసం ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ ఎఫ్, విహెచ్పిఎస్, ఎం ఈ ఎఫ్ అనుబంధ సంఘాల, జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకుల కార్యకర్తలు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలు సభకు తరలిరావలెనని కోరుతున్నాము. ప్రత్యేకంగా మిషన్ 50 రోజుల్లో 100 గ్రామ కమిటి నిర్మాణాలను పూర్తిచేసిన గ్రామకమిటిలనుతప్పకుండా తీసుకరావలసిన బాధ్యత టీమ్కు టీమ్డర్లుగా వ్యవహరించే వారిదే పూర్తి బాధ్యతగా గుర్తించాలని గమనించగలరు.పల్లెకు పోదాం – ఎం ఎస్ పిని భలోపేతం బలోపేతం చేయాలని సూచనలు సలహాలు ఇచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!