వర్ధముంపులు మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత…

వర్ధముంపులు మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సంగమేశ్వర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన గోత్రాల బాలరాజు బాధిత కుటుంబానికి మండల వ్యవసాయ అధికారిని మణిదీపిక 20వేల రూపాయలను ఆర్థిక సహాయంగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర మండలాలు, జిల్లాలలో తోటి వ్యవసాయ శాఖ అధికారులుగా పనిచేస్తున్న 30 మంది కలసి ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగిందని తెలిపారు. పిల్లలకు చదువు నిమిత్తం కావలసిన అవసరాలుంటే తమను సంప్రదించాలని సూచించారు. బాయిత కుటుంబానికి చెందిన రుత్విక్ సాకేత్ ను ఓదార్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!