వరద బాధితుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ విజయశాంతి….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా భారీగా నష్టపోయిందని తెలుసుకొని ఎమ్మెల్సీ విజయశాంతి తో పాటు జిల్లా కలెక్టర్ ఆశిష్ లు ఆదివారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జి ఆర్ కాలనీలోని ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను నివేదికల ఆధారంగా ఆదుకుంటామని ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో పంట నష్టాలతో పాటు రోడ్లు, ఇతర అన్ని నష్టాలపై నివేదికలు ప్రభుత్వానికి అందించిందని దీనిపై పూర్తిస్థాయిలో ప్రజలకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. అధికారులు బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆమె కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…