కూలిపోయిన ప్రహరీని పరిశీలించిన దోమకొండ కాంగ్రెస్ నాయకులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ. దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ప్రహరీ ముంచెత్తిన వర్షంతో, కుంగిపోయి కూలిపోయింది. కూలిపోయిన ప్రహరిని ఆదివారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. 20 గజాల మేర ప్రహరీ కూలిపోవడంతో, విద్యార్థినులు, గురుకుల పాఠశాల సిబ్బందికి రక్షణ లేకుండా, భయాందోళనగా ఉందని అన్నారు. తక్షణమే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి, ప్రహరీ బాగు చేయించేందుకు కృషి చేస్తామని అన్నారు . కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, ఐరేని నర్సయ్య, నల్లపు శ్రీనివాస్, సీతారాం మధు, ఆబ్రబోయిన రాజు, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


