- మూడు రోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 1 (అఖండ భూమి న్యూస్)
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం హాయ్ ఆ జిల్లాలో భారీ వర్షాల కారణంగా దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీనితోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చునని చెప్పారు.
నేడు కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉంది అంచనా వేశారు. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.