ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 1 (అఖండ భూమి న్యూస్) ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 46 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులనుండి వివిధ సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


