ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ముంపుకు గురైన కాలనీలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 1 (అఖండ భూమి న్యూస్) వరదలు వచ్చి కొట్టుకుపోతున్న ప్రజలను ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే కామారెడ్డి జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ,కౌండిన్య కాలనీ మునిగిందని బూతు మాటలు మాట్లాడిన కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ. కామారెడ్డి ఎమ్మెల్యే తీరు ఒడ్డు దాటే దాకా ఓడ మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఉందన్నారు. నిన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ప్రజల తమ అవసరాలు బాధలు గాధలు తీరనప్పుడు ప్రజా ప్రతినిధులను ప్రభుత్వాలను నిలదీసే హక్కు విమర్శించే హక్కు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని విమర్శించగానే నాకు ఓటు వేయ కున్న సరే అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
గ్రామాలలో కులాల పేరుతో ప్రజలను విడగొట్టి తన సొంత డబ్బులతో నిధులు ఇస్తున్నాను చెప్పి డబ్బులు పంచుతూ పంచిన డబ్బులకు చేయించిన పనులకు ఎస్టిమేషన్లు వేయించి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఢిల్లీ చుట్టూ మీ నాయకుల చుట్టూ తిరగడం లేదా అని ప్రశ్నించారు. కామారెడ్డి ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని ఇక్కడ ప్రజలను ఎంత మోసగించాలనో ప్రయత్నం చేసిన తిరగబడతారని మరో మారు హెచ్చరించారు. రమణారెడ్డికి ప్రజల మీద ఈ నియోజకవర్గ ఓటర్ల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామారెడ్డి లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాకు ఓట్లే సిరు నేను గెలిచినా నేను ఎమ్మెల్యేను నన్ను ఏం చేస్తారని అనుకుంటున్నావేమో మేము సవాల్ విసురుతున్నాం అన్నారు. హౌసింగ్ బోర్డ్ కౌండిన్య కాలని జి ఆర్ కాలనీ లో బహిరంగ చర్చకు సిద్ధ మా నీ ప్రశ్నించారు.