హెచ్ఐవీ, ఎయిడ్స్ పై అవగాహన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 1 (అఖండ భూమి న్యూస్)
పాల్వంచ మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో సోమవారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు వై ఆర్ జి కేర్ ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో లింకు వర్కర్ స్కీం జిల్లా రిసోర్స్ పర్సన్ గర్దాస్ సుధాకర్ మాట్లాడుతూ… హెచ్ఐవి వ్యాపించి మార్గాల గురించి వివరించారు. ఆరోగ్యం, మందులు తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసినట్లయితే హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ దశకు చేరుకునే అవకాశం ఉందన్నారు. టీబీ వ్యాధి లక్షణాలు, ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి వివరించారు. వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యపు అలవాట్లు, భవిష్యత్తులో ఉన్నత స్థానంలో రాణించే మార్గాల గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, లింకు వర్కర్ బాల్ కిషన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.