ఎమ్మార్పీఎస్ వర్గీకరణ సాధించడమే ముఖ్య లక్ష్యం
వెల్దుర్తి మే 14 (అఖండ భూమి) : ఏబిసిడి వర్గీకరణ సాధించడమే మాదిగల అంతిమ లక్ష్యమని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నాయకంటి గిడ్డయ్య మాదిగ అన్నారు. ఆదివారం స్థానిక వెల్దుర్తి పట్టణం నందు హలో మాదిగ చలో డోన్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెస్ పి జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు ఈనెల 18న డోన్ లో జరిగే బహిరంగ సభ జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పి పార్టీ నాలుగో రాజకీయ పార్టీగా ఎదుగుతుందని అన్నారు. ఈ పార్టీ ఎదుగుదలకు ప్రతి గ్రామంలోనూ ఎంఎస్పి కమిటీలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వెల్దుర్తి మండల అధ్యక్షులు నాయక్ అండ్ గిడ్డయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఏం బజార్, మోష, జగ్గుల బజారు, రెడ్డి పోగు భాస్కర్, సూర్యచంద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



