బీసీ బిల్లుతో బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తుంది…

బీసీ బిల్లుతో బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తుంది…

 

రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);

బీసీ బిల్లుతో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేస్తుందని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి లో విలేకరులతో మాట్లాడారు. వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచివారిని ఆదుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేశ్వరం అవినీతి జరిగిందని అందుకే సిబిఐ విచారణ ప్రభుత్వం కోరడం జరిగింది అన్నారు. బీ ఆర్ఎస్ లో అంతర్గత కొమ్ములాటలు సాగుతున్నాయని కవిత హరీష్ రావు పై ఆరోపణలు చేయడం నిదర్శనం అన్నారు. అవినీతి జరిగినట్లు కవిత వెల్లడించిందని ప్రజలందరూ గ్రహించారని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన బిల్లుతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది అన్నారు.

కాలేశ్వరం పై ప్రజాధనాన్ని వేల కోట్లు దుర్వినియోగం చేసిన కేసీఆర్.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పక్కనా పెట్టి పార్టీ నుండి కవిత, హరీష్ రావు లను ఎవరినైనా ఒకరిని సస్పెండ్ చేయాలన్నారు.

కాలేశ్వరం అవినీతి పైన అసెంబ్లీలో చర్చ తర్వాత ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు అప్పుడు ప్రభుత్వంలో ఉండి అవినీతిపై ఎందుకువీ మాట్లాడలేరు అన్నారు. కవిత

వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది వారిని ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!