కాలేశ్వరం ప్రాజెక్టు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసనగా రేపు ధర్నా , రాస్తారోకో…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబరు 1 (అఖండ భూమి న్యూస్)
కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపు మేరకు మంగళవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.
సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే……
లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10-00 గంటలకు దోమకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ దగ్గర ధర్నా*కార్యక్రమం కలదు.
కావున మండలంలోని అన్ని గ్రామాల నాయకులు , కార్యకర్తలు ఇట్టి ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు..