తాళ్లరేవు: కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం క్వారింగ పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుని దిమ్మె కూడలిలో ప్రైవేటు బస్సు, ఆటో ఢీకొన్నాయి..
ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురిని యానాం ఆసుపత్రికి తరలించారు. సీతారామపురంలోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు విధులు ముగించుకొని నేలపల్లి, యానాం గ్రామాలకు ఆటోలో బయలుదేరారు..
బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనతో ఈ దర్ఘుటన జరగింది. ఆటో నుజ్జునుజ్జవడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆటోలో ఇద్దరి మృతదేహాల ఇరుక్కుపోగా.. స్థానికుల సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద స్థలిని మాజీ మంత్రి కన్నబాబు, యానాం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కుమార్, శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు..
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



