మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పరిశీలించిన మంత్రి పూర్ణం వాటికి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 7 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రుల పొన్నం ప్రభాకర్ ,వాకిటి శ్రీహరిలు ఆదివారం తనిఖీ చేశారు.
విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రులు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని,విధిగా మెనూ పాటించాలని అన్నారు. మంత్రులు.. పాఠశాలలో బుష్ క్లియర్ చేయాలని సూచించారు.
విద్యార్థులకు పాఠ్యప్రణాళిక ఎక్కడి వరకు పూర్తయింది అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకోనీ విజయం దిశగా సాగాలని సూచించారు.విద్యార్థినులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని ,క్రీడల్లో రాణించాలని సూచించారు.. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.