ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 8 (అఖండ భూమి న్యూస్) భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి లో గాంధీ చౌక్ వద్ద సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి *పాలాభిషేకం చేయడం జరిగింది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సంయుక్త నిర్ణయం మేరకు పేద ప్రజల నిత్యవసర వస్తువులపై ,ఆటోమొబైల్ రంగంలోని వస్తువులపై గణనీయమైన రీతిలో జిఎస్టి తగ్గించారనీ అన్నారు. ఇది చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణ గాంధీ చౌక్ లో పాలాభిషేకం చేశారు.
అనంతరం బిజెపి నాయకులు మాట్లాడుతూ. ప్రతి సామాన్యుడికి నిత్యవసర వస్తువుల ధరలు భారంగా మారకుండా జిఎస్టిని తగ్గించి మధ్యతరగతి ప్రజానీకానికి చేరువయ్యేలాగా నిత్యవసర వస్తువులపై12 % ఉన్న జీఎస్టీ ని 5% శాతం గా ఆటోమొబైల్ రంగంలో 28% గా ఉన్న జీఎస్టీ ని 18 % తీసుకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయుడు హెల్త్ ఇన్సూరెన్స్ , లైఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ వీటిపై ఉన్న జీఎస్టీ ని పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనీ అన్నారు.
పేద ప్రజలపై వివిధ టాక్స్ ల పేరుతో ప్రజలను పట్టిపీడిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదలకు మరింత చౌకగా నిత్యవసర వస్తువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనిత్యవసర వస్తువుల పై ఉన్న జిఎస్టి తగ్గిస్తే రాష్ట్ర వాటా తగ్గుతుందని కేంద్రంపై ఏడవడం ఆపాలని ప్రజల మేలు కోసం చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించాలని బిజెపి నాయకులు సూచించారు.
ఈ భారతదేశం సర్వసత్తాక దేశం అని పుష్కలమైన సహజ వనరులు ఆర్థిక వనరులు , మానవ మానవుల కలిగిన దేశమని ఈ దేశం ఎవరికి తలవంచదని ఈ దేశంలో తయారైనటువంటి వస్తువుల పైన కక్షపూరితంగా పన్నులను విధిస్తూ తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుందని అన్నారు. కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్న కొన్ని దేశాలకు ఈ జీఎస్టీ తగ్గింపు అనేది ఒక చెంపపెట్టు లాంటిదని ఉన్నారు.ఈ దేశం స్వచ్ఛమైన స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తుందని కుటిల బుద్ధితో బెదిరింపులకు కుట్రలకు పాల్పడితే దానికి తగ్గట్టు సమాధానం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి,బాలకిషన్ , బత్తిని దేవేందర్ , పట్టణ అధ్యక్షులు అగల్ దివిటి, రాజేష్ ,మండల అధ్యక్షులు పెద్దేడ్ల నర్సింలు ,మాజీ పట్టణ అధ్యక్షులు కుచులకంటి, సతీష్, ప్రధాన కార్యదర్శి కుచులకంటి శంకర్, ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, పులి రమేష్, కార్యదర్శి మామిడి రమేష్ కోశాధికారి గజానంద్ మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ యువ నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.