తెలంగాణ.సీఎం రేవంత్ రెడ్డి కి. పాలాభిషేకం చేసిన. భవన నిర్మాణ కార్మికులు …

తెలంగాణ.సీఎం రేవంత్ రెడ్డి కి. పాలాభిషేకం చేసిన. భవన నిర్మాణ కార్మికులు …

 

ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో

సొసైటీ ప్రాంతం. లింగారెడ్డి పేట్ రోడ్డు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 10 (అఖండ భూమి న్యూస్) తెలంగాణ.భవన నిర్మాణ రంగల.కార్మిక సంఘం రాష్ట్ర వ్యవస్థాపక.అధ్యక్షులు దరిపల్లి చంద్రన్న పిలుపుమేరకు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు కార్మికుల ఇన్సూరెన్స్ ప్రమాద శాతం మరణించిన కార్మికునికి ఆరు లక్షల 30000 ఇచ్చేవారు అవి 10 లక్షలకు పెంచినారు అని గుర్తు చేశారు. సహజ మరణానికి లక్ష 30 వేల రూపాయలు ఇచ్చేది రెండు లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అంగవైకల్ అయిన కార్మికునికి రెండు లక్షల 50 వేల నుండి ఐదు లక్షలు పెంచినందుకు కార్మికులను ఆదుకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు మా కోరికలు

55 సంవత్సరాలు దాటిన కార్మికునికి 5000 రూపాయలు పింఛను సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అన్నారు.60 సంవత్సరాలు దాటిన కార్మికునికి లేబర్ కార్డు తొలగిస్తుంది. శాశ్వతంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు ఈఎస్ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అన్నారు. వెల్ఫేర్ బోర్డుకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బోర్డుకు చైర్మన్ ఉన్నాడు, ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తయింది.కాబట్టి వెల్ఫేర్ బోర్డుకు చైర్మన్ నియమించాలన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుని దరిపెల్లి చంద్ర అన్నను చైర్మన్ చేయాలని తెలంగాణ వ్యాప్తంగా భవన.నిర్మాణ రంగాల కార్మికులు కోరారు.

లేబర్ కార్డు విషయంలో గాని.బెనిఫిట్ విషయంలో గాని. స్థానికంగా.వచ్చి అధికారులు.సర్వే చేసి. కష్టజీవులకు గుర్తించి. ఏ రంగానికి సంబంధించిన. శ్రమించే చెమట జీవులకు వారికి మాత్రమే. ఇవ్వాలన్నారు. బాన్సువాడ పరిధిలో.నకిలీ కార్డులు. నకిలీ. లబ్ది. జోరుగా సాగుతుంది అన్నారు. ప్రభుత్వం. సర్వే చేసి. మధ్యవర్తులను. చట్టపరంగా. శిక్షించాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఎల్లారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు మహామేస్త్రి. మర్లు సాయి బాబు.ప్రధాన కార్యదర్శి. కాంతారావు.కోశాధికారి. దుర్గా సింగ్ లక్ష్మణ్. దావీద్ గణేష్ ప్రచార కార్యదర్శిలు.కరీం. చందు. మాజీ అధ్యక్షులు. శ్యామ్ సలహాదారులు. పోచయ్య.రాజు.రామ్మోహన్రావు. సత్యనారాయణ.జయరాజ్.అంకం బాబు.మైపాల్ బాలయ్య. రవి. రఫిక్ జాన్. సైదా. కార్మికులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!