పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని*భారీ ర్యాలీ…
విద్యా శాఖ మంత్రి వెంటనే నియమించాలు .
ముఖ్యమంత్రి కామారెడ్డి పర్యటన రాకముందే బకాయిలను విడుదల చేయాలి..
రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ డిమాండ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 10 (అఖండ భూమి న్యూస్) భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేలది మందితో కొత్త బస్టాండ్ నుండి నిజాంసా చౌరస్తా వరకుభారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9000 కోట్లపైగా విద్యార్థులకు రావలసిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద రావలసిన డబ్బులు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మంత్రులకు,ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చిన విడుదల చేస్తామని మాట ఇచ్చి తప్పడం జరిగిందన్నారు. స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వలన కార్పొరేట్,ప్రయివేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కామారెడ్డి పర్యటన రాకముందే విద్యార్థులకు పెండింగ్లో ఉన్న బకాయలను విడుదల చేయాలని హెచ్చరించారు.లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యశ్వంత్, అర్బస్ ఖాన్, జిల్లా ఇన్చార్జి పెరుమాండ్ల బుల్లెట్ చక్రవర్తి, నాయకులు గడ్డం రవి, చిట్యాల లింగం, ప్రసాద్,రాజు, శివకుమార్,మనోజ్ విద్యార్థులు పాల్గొన్నారు…