ఘనంగా కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ వర్ధంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 10 (అఖండ భూమి న్యూస్) బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఇలమ్మ వర్ధంతి కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎల్.బి. చందర్ గారు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి వీనా గారు చాకలి ఇలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ “చాకలి ఇలమ్మ గారు తెలంగాణ రైతాంగ పోరాటానికి చిహ్నం. దళిత–బహుజన సమాజానికి ఆమె ధైర్యం, పోరాటస్ఫూర్తి నింపిన మహనీయురాలు. ఆమె త్యాగం, వీరస్వభావం తరతరాలకు ఆదర్శం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో. అలాగే జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ గారు, సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్ బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం, రాజయ్య , శ్రీకాంత్,నాగరాజు, రాజేశ్వర్, పవన్, అశ్వక్, సునీత, విజయ,జిల్లా అధికారులు , పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.