వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల సేవలు అమోఘం…

వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల సేవలు అమోఘం…

 

30 పడకలకు కాదు 100 పడకలగా సేవలు..

ప్రభుత్వ వైద్యుల సేవలుతో ఆర్ఎంపీలు కనుమరుగు..

జిల్లాలోని పలు మండలాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు 70 పడకలుగ తీర్చిదిద్దాలని రోగులు కోరుతున్నారు.

వెల్దుర్తి సెప్టెంబర్ 10 (అఖండ భూమి న్యూస్) : మండల కేంద్రమైన వెల్దుర్తి ప్రభుత్వ వైద్య సేవలు అమోఘమని ఫుడ్ సేఫ్టీ స్టేట్ కమిషనర్ సభ్యులు దేవి గణ్యమాల అన్నారు. బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణ ప్రభుత్వ వైద్యశాల నందు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భవతులకు ఎప్పటికప్పుడు సరైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు సరైన  వైద్య సేవలు అందుతున్నందుకు వర్షంం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యశాల నందు 30 పడగలకు మించి వైద్య సేవలు అందిస్తున్న ఘనత వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి వైద్య అధికారులకు దక్కుతుందని తెలిపారు. వెల్దుర్తి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం రోగులకు సక్రమంగా అందడంతో ఆర్.ఎం.పి వైద్య సేవలు కనుమరుుగవతున్నాయి. వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల నందు అదనపు వసతులు కల్పించాలని వినతి పత్రం అందించారు.  ప్రభుత్వ వైద్యశాల అందు విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందినీ కూడా అభినందించడం జరిగింది. ప్రభుత్వ వైద్యశాల రోగులకు అందిస్తున్న వైద్యం రోగులను అడిగి తెలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!