15న కామారెడ్డి లో నిర్వహించే బీసీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలి…

15న కామారెడ్డి లో నిర్వహించే బీసీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలి…

 

గత ప్రభుత్వ పాలకుల వల్ల బీసీలు మరింత వెనుకబడ్డారు..

కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు ఆమోదించకపోవడంతోనే అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టాం..

టిఆర్ఎస్, బిజెపిలు రెండు ఒకటే..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 11 (అఖండ భూమి న్యూస్);

ఈనెల 15 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే బీసీ డిక్లరేషన్ సభకు లక్షలాదిమంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ లు అన్నారు. గురువారం కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బిబిపేట్, భిక్కనూరు మండలాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ కులాల జనగణనతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తేల్చిందని అన్నారు. అత్యధికంగా ఉన్న బీసీలను దృష్టిలో ఉంచుకొని కనీసం 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అందించాలని ఉద్దేశంతో కామారెడ్డి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ హామీని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రనికి సిఫార్సు చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపి అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఏదో సాకుతో బీసీల కు న్యాయంగా కల్పించే రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపి బీసీల లెక్కను తేల్చకుండానే వారికి అన్యాయం చేసిందని అన్నారు. టబీ ఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని అన్నారు బీసీలపై కపట ప్రేమ చూపుతూ వారికి న్యాయంగా లభించే స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాలలో పరోక్షంగా అడ్డుకుంటుందని అన్నారు. దళితులకు బీసీలకు కాంగ్రెస్ పార్టీతోనే సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా పనిచేసి అమలు చేయడంలో ముందుంది అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కి భరోసా అందిస్తే వారికి వెంట అంటూ ఉంటుందని గుర్తు చేశారు. బహుజనుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తుందని అన్నారు. ఈనెల 15 నా కామారెడ్డి లో నిర్వహించే బీసీ డిక్లరేషన్ సభకు లక్షలాది మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సభను విజయవంతం చేసేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!