అటవీ శాఖ సిబ్బంది అధైర్యపడవద్దు ఘనంగా అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం…
కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి భోగా నిఖీత
కామారెడ్డి :… కామారెడ్డి జిల్లా అటవీశాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం రోజున జిల్లా ఆటవిశాఖ కార్యాలయంలో గురువారం జిల్లా అటవీ శాఖ అధికారిణి భోగా నికిత అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అటవీశాఖ అమరవీరుల సంరక్షణలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. సిబ్బంది ఎవరు కూడా అధైర్య పడవద్దని ఏవైనా సమస్యలు ఎదురైతే సమిష్టిగా ఎదుర్కోవాలని ఆమె సూచించారు. అనంతరం కామారెడ్డి పట్టణంలో ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ డివిజన్ అధికారి రామకృష్ణ బాన్సువాడ అడవి డివిజన్ అధికారి సునీత,జిల్లా రేంజ్ అధికారులు హబీబ్,రమేష్, వాసుదేవ్, చరణ్ తేజ, హిమ చందన, రవికుమార్, సంతోష్, జె ఎఫ్ ఓ జిల్లా అధ్యక్షులు శ్రీమతి సుల్తానా జిల్లా అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.