బాబోయ్‌.. ఈ ఖర్చులు భరించలేం!

బాబోయ్‌.. ఈ ఖర్చులు భరించలేం!

 

ఎండీ, వరల్డ్‌ప్యానెల్‌ బై న్యూమరేటర్‌ (దక్షిణాసియా)

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 11 (అఖండ భూమి న్యూస్);

నిత్యావసరాలూ కొనలేకున్నాం

దేశంలో 58 శాతం మంది ప్రజల అభిప్రాయమిదే

మూడేండ్లలో ఏకంగా 33 శాతం పెరిగిన కుటుంబాల ఖర్చులు

ధరాఘాతంతో చితికిపోయామని చెప్పిన 59 శాతం మంది

అత్యవసరమైన వస్తువులనే కొంటున్నామన్న 80% మంది

‘వరల్డ్‌ ప్యానెల్‌ బై న్యూమరేటర్‌’ తాజా సర్వేలో వెల్లడి

 

కేంద్రంలోని ఎన్డీయే పాలనలో ధరాఘాతంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో మోదీ సర్కారు వైఫల్యం.. సామాన్యుడి బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నది. గడిచిన మూడేండ్లలో ఇంటి ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, నిత్యావసరాలను కూడా కొనలేకపోతున్నామని దేశంలోని 58 శాతం మంది ప్రజలు లబోదిబోమంటున్నారు. పొదుపు మాట అటుంచితే, పిల్లల స్కూల్‌ ఫీజుల కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి వాటిల్లిందని మెజార్టీ ప్రజలు వాపోతున్నారు. ఈ మేరకు మార్కెట్‌ రిసెర్చ్‌ సంస్థ ‘వరల్డ్‌ ప్యానెల్‌ బై న్యూమరేటర్‌’ తాజా సర్వేలో వెల్లడించింది.

మూడేండ్లలోనే పైపైకి

ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకోవడంతో నిత్యావసరాల కోసం చేసే ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్క

Akhand Bhoomi News

error: Content is protected !!