కామారెడ్డి లో బీసీ రిజర్వేషన్ సింహగర్జన సభ వాయిదా..!

కామారెడ్డి లో బీసీ రిజర్వేషన్ సింహగర్జన సభ వాయిదా..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 12 (అఖండ భూమి న్యూస్) ఈనెల 15న బిసి డిక్లరేషన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సింహ గర్జన సభను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర టిపిసిసి శుక్రవారం ప్రకటించింది. ఇటీవల భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగైదు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సభను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగనన చేసి అత్యధికంగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా బిల్లులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ఎన్నికల్లో ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి బిసి డిక్లరేషన్ 42 శాతం కు కట్టుబడిందని అన్నారు. ఈ విషయంపై కామారెడ్డిలో ఈ నెల 15 నిర్వహించి బీసీ సింహ గర్జన సభలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయడానికి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ సభను మరోసారి అధికారికంగా ప్రకటిస్తామని టిపిసిసి ప్రకటించింది.

Akhand Bhoomi News

error: Content is protected !!