ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి …
సిఐటియు చంద్రశేఖర్ డిమాండ్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 15 (అఖండ భూమి న్యూస్) తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముందు సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో లో అంగన్వాడీ మినీ అంగన్వాడి లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని రిటైర్మెంట్ జీవో నెంబర్ 8 సవరణ కాళీ పోస్టుల భర్తీ 24 రోజుల సమ్మె వేతనం తదితర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి లో ఇంటిముందు అంగన్వాడి టీచర్ ఆయాలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి కే చంద్రశేఖర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసి డిఎస్ తో పాటు విద్య వ్యవస్థను పూర్తిగా నిర్ణయం చేయడం కోసం నూతన జాతీయ విద్య విధానం చట్టాన్ని తెచ్చింది ఇంతటి ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా ఐసిడిఎస్ ను మొత్తం నిర్వహించేస్తున్నది ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ పిఎం శ్రీవిద్య పేరుతో ఐదు సంవత్సరాలలో పిల్లలను విద్యాశాఖను అప్పగిస్తూ నిర్ణయం చేసిందని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాలనే నిర్వహించాలి విద్యా బోధన బాధ్యతలను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఇవ్వాలి అదనపు వేదం చెల్లించాలన్నారు. దీంతో పాటు అంగనవాడి సేవలను తప్పనిసరి చేసినప్పి క్యాప్సర్ ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని రద్దు చేయాలనీ ఈ విధానం వల్ల అంగన్వాడి టీచర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్స్ పనిచేయడం లేదని అనేక ఆకాంక్షాల వల్ల పేస్ క్యాప్సర్ కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మిన పోస్టులు పెట్టిన విధంగా కనీస వేతన 18000 రూపాయలు ఇవ్వాలన్నారు. పిఏపీఎస్సీ సౌకర్యం కల్పించి హామీ ప్రకారం వెంటనే జీవో నెంబర్ ఇన్ సవరించాలన్నారు. పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2024 జూలై 1 నుంచి చెల్లించి మూడు నెలల పిఆర్సి మినీ టీచర్లకు 11 నెలల ఏరియాస్ రిటైర్మెంట్ అయిన వాళ్లకు 10 నెలల సిబి బకాయిలు వెంటనే చెల్లించి వెంటనే భర్తీ చేయాలన్నారు. సీనియారిటీని బట్టి ఇంక్రిమెంట్ నిర్ణయించి ఐసిడిఎస్ మంత్రి హామీ ప్రకారం కారణ్య నియమకాలు త్వరగా నిర్ణయించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడి ఉద్యోగులకు గ్రాడ్యుటి చెల్లించి, రిటైర్మెంట్ అయిన అంగన్వాడి ఉద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ ఇవ్వాలన్నారు. మట్టికల్స్ జీవో నెంబర్ 11 సవరించి ,టీచర్లతో సమానంగా హెల్పర్లకు 20,000 చెల్లించాలన్నారు. 2017 నుండి టీఏ డీఏ ఇంక్రిమెంట్ ఇంచార్జ్ అలవెన్స్ బకాయి చెల్లించి , అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బిఎల్ఓ డ్యూటీ రద్దు చేసి, అదనపు పనులు చేయించకూడదు తదితర న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పిఏ కు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ముదామ అరుణ్ కుమార్, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి బాబాయి లక్ష్మి, యాదమ్మ ,సురేఖ ,విజయ, సరిత , సుజాత ,సునంద, సిద్దమ్మ ,లలిత ,సురేఖ, రాణి, కవిత ,అలివేలు, స్రవంతి, సరస్వతి ఇందిరా రాజేశ్వరి రాణి ,అంగన్వాడీ టీచర్స్, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.