బాల్యవివాహాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి…

బాల్యవివాహాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి…

 

టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 15 (అఖండ భూమి న్యూస్)

బాల్య వివాహాల రహిత ప్రపంచాన్ని రూపుదిద్దుదాం

బాల్య వివాహాలు నిర్వహించ వద్దని ప్రతిజ్ఞ చేసిన పాస్టర్లు..

టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 15 (అఖండ భూమి న్యూస్)

బాల్యవివాహాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని టీపీసీసీ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సుంకరి గిరిజతో బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా.. 39 దేశాల్లో బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చేపట్టడం హర్షణీయం అన్నారు. జిల్లాలో అత్యధికంగా బాల్యవివాహాలు నమోదు అవుతున్నాయని, నిర్మూలించేందుకు కృషి చేయాలని కోరారు. బాల్య వివాహాలను రూపుమాపేందుకు చర్చి పాస్టర్లు, పురోహితులు, ఖాజీలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ,తాజా మాజీ పట్టణ కౌన్సిలర్లు,యూత్ సభ్యులు సంస్థ ప్రతినిధులు జ్యోతి, మమత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!