విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి…
కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 18 (అఖండ భూమి న్యూస్) విద్యార్థులు ఆటలతోపాటు క్రీడల్లో రాణించాలని కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య రెడ్డి అన్నారు. గురువారం దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలోని నిర్వహించిన దోమకొండ కోట గ్రామ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించినటువంటి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన పాఠశాలలా క్రీడాకారులకు గడికోట నందు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆటల్లో రాణించి మండల, జిల్లా, రాష్ట్ర. , జాతీయస్థాయిలో రాణించి విద్యార్థులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. చదువులు భవిష్యత్తును నిర్ణయిస్తాయని, క్రీడలు ఆటలతో పాటు మానసిక ఉల్లాసం మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజు , సిఐ సంపత్ , దోమకొండ మండల అధికారి ప్రవీణ్ కుమార్. ,మాజీ జెడ్పిటిసి తీగలు తిరుమల , వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎస్పీ చైతన్య రెడ్డి స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో విద్యార్థులను చైతన్య పరుస్తూ క్రీడలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి అన్నారు. జీవితంలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయి, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలు క్రీడల వల్ల ఉన్నాయని తెలియజేశారు. క్రీడాకారులకు బహుమతులను అతిధుల చేతుల మీదుగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బాబ్జి మాట్లాడుతూ. మండల స్థాయి నుండి జిల్లా స్థాయిలో క్రీడలను నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు ఎన్ గణేష్ యాదవ్, కళ్యాణపు కనక శీను హరీష్ రామకృష్ణ వినయ్, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.