తాళ్ల రాంపూర్ లో ఈనెల 19న విడిసి సభ్యుల ఇండ్ల ముట్టడికి భారీగా గౌడ సోదరులు తరలి రావాలి
– జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోళ్ళ మురళి గౌడ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18. (అఖండ భూమి న్యూస్) నిజామాబాద్ జిల్లాలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో విడిసి సభ్యుల ఆగడాలను అడ్డుకోవడానికి విడీసీ సభ్యుల ఇండ్ల ముట్టడికి జై గౌడ ఉద్యమం జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. విడిసి ఆగడాల వల్ల గౌడ బిడ్డలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్ అన్నారు. కామారెడ్డి లోని జై గౌడ ఉద్యమం కార్యాలయంలో గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాళ్ల రాంపూర్ గ్రామంలో విడిసి సభ్యులు గౌడ బిడ్డలను ఒక రూములో వేసి బంధించడం దారుణం అన్నారు. విడిసి ఆగడాలపై తిరుగుబాటు యుద్ధం మొదలైంది అన్నారు. దీనిలో భాగంగా జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో తాళ్ల రాంపూర్ విడిసి సభ్యుల ముట్టడికి శుక్రవారం భారీ సంఖ్యలో గౌడ బిడ్డలు తరలిరావాలని పిలుపునిచ్చారు.