100వ రోజుకు ‘యువగళం’.. పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు

 

 

శ్రీశైలం: తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం'(Yuvagalam) పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది..

 

శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్‌ సైట్‌ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు. మార్గంమధ్యలో తల్లి షూ లేస్‌ను లోకేశ్‌ కట్టారు. పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు. బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో ‘యువగళం’ పాదయాత్ర జాతరను తలపిస్తోంది..

 

కుటుంబసభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్‌ శ్రీమాన్‌, సీహెచ్‌ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్‌ తదితరులు లోకేశ్‌తో కలిసి ముందుకు సాగారు. పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు తరలివచ్చారు..

Akhand Bhoomi News

error: Content is protected !!