స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్
ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
త్రిపురాంతకం మండలం ధూపాడు గ్రామం
అఖండ భూమి , యర్రగొండపాలెం వెబ్ న్యూస్ : మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వతoత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్పూర్తిగా తీసుకొని స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుకున్నాను.
ఈ ప్రతిజ్ఞను పూనుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన *స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్కా ర్యక్రమాన్ని గురువారం దూపాడు గ్రామంలోని
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గ్రామ సర్పంచ్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ పిల్లలతో ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మాలిక్ భాషా, సచివాలయం సెక్రెటర్ శ్రీనివాస రావు, వెల్ఫెర్@ఎడ్యుకేషన్ వెంకటేశ్వర్లు, సి ఆర్ పి శ్యామ్ మరియు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



